Magunta Sreenivasulu:ఆయన కూడా వీడతారని అసలు ఊహించని వైసీపీ

వైసీపీకి మరో ఊహించని షాక్‌ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి

Update: 2024-02-28 04:54 GMT

Magunta Sreenivasulu:వైసీపీకి మరో ఊహించని షాక్‌ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించామని చెప్పారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. ఇటీవల పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని చెప్పారు.

జగన్‌ను తమ కుటుంబసభ్యుడిగా భావించామని.. ఐదేళ్లు సహాయ సహకారాలు అందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానన్నారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే, ఒక బ్రాండ్‌ ఉందని.. తమ కుటుంబానికి అహం లేదన్నారు. ఉన్నది ఆత్మాభిమానం మాత్రమే అన్నారు. వచ్చే ఎన్నికల బరిలో ఉండే మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వినిపించింది. ఈ పరిణామాలపై మాగుంట శ్రీనివాసులు రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.


Tags:    

Similar News