పోలవరం పనుల్లో కీలక ఘట్టం ప్రారంభం
పోలవరం ప్రాజెక్టులో అతి కీలక ఘట్టం డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు నేడు ప్రారంభం అయ్యాయి.
పోలవరం ప్రాజెక్టులో అతి కీలక ఘట్టం డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు నేడు ప్రారంభం అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద ఇందుకోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. పోలవరం నిర్మాణంలో నిపుణులు, కేంద్ర జలవనరుల శాఖ సూచన మేరకు ఈ డయాప్రమ్ వాల్ నిర్మాణ పనులు సాగుతున్నాయి.
జపాన్ నుంచి తెప్పించిన...
ఇందుకోసం జపాన్ నుంచి ప్రత్యేకంగా మిషనరీని తెప్పించారు. డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయితే పోలవరం ప్రాజెక్టు పనులు మరింతగా పరుగులు తీస్తాయని అధికారులు చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులకు సంబంధించిన టైం బౌండ్ కార్యక్రమాలను నిర్దేశించిన నేపథ్యంలో ఈ పనులు నేడు ప్రారంభమయ్యాయి.