తుళ్లూరు పోలీసుస్టేషన్‌లోని లాకప్‌లో దోమలు కుడుతున్నాయి: నందిగం సురేష్‌

తుళ్లూరు పోలీసుస్టేషన్‌లోని లాకప్‌లో దోమలు కుడుతున్నాయని, ఫ్యాన్‌ లేక ఇబ్బందులు పడుతున్నానని మాజీ ఎంపీ నందిగం సురేష్‌ కోర్టుకు తెలిపారు.

Update: 2025-05-30 11:30 GMT

తుళ్లూరు పోలీసుస్టేషన్‌లోని లాకప్‌లో దోమలు కుడుతున్నాయని, ఫ్యాన్‌ లేక ఇబ్బందులు పడుతున్నానని మాజీ ఎంపీ నందిగం సురేష్‌ కోర్టుకు తెలిపారు. మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగి ఒత్తిడి చేస్తున్నారని మంగళగిరి కోర్టులో నందిగం సురేష్‌ తరఫున న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.


లాకప్‌లో ఫ్యాను, దోమల మందు వినియోగించుకొనేందుకు అనుమతించాలని కోరారు. లాకప్‌ రూమ్‌లో విద్యుత్తు బల్బులు, ఫ్యాన్, పొగ వచ్చే దోమల చక్రాలు వినియోగించడానికి నిబంధనలు అనుమతించవని తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు కోర్టుకి తెలిపారు. లాకప్‌ బయట నుంచి గాలి వచ్చేలా టేబుల్‌ ఫ్యాన్, దోమల చక్రాలు పెట్టుకొనేందుకు అవకాశం ఇవ్వాలని నిందితుడి తరపు న్యాయవాది కోరగా జడ్జి అనుమతించారు.

Tags:    

Similar News