రాజధాని పనులను పరిశీలించిన నారాయణ
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు.
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. నేలపాడులోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల పనుల పరిశీలించారు. గ్రూప్-డి అధికారుల నివాసాలు, హ్యాపీనెస్ట్ టవర్ల పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్ట్ సంస్థలకు దిశానిర్దేశం చేశారు.
అనుకున్న సమయానికే...
క్వార్టర్లు, బంగళాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి నారాయణ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నివాస సముదాయాలు మార్చిలోగా పూర్తవుతాయని, ఉద్యోగులకు ఆస్పత్రుల కోసం విట్, ఎస్ఆర్ఎంతో సంప్రదింపులు జరిపామన్న నారాయణ నాలుగు వేల మంది ఉద్యోగుల కోసం 100 పడకల ఆస్పత్రి, పాఠశాలలకు అంగీకరించాయని చెప్పారు. రాజధాని పనులు జరగట్లేదని వైసీపీ చేసే దుష్ప్రచారాలు నమ్మొద్దని, సింగపూర్ ప్రభుత్వంతో మైత్రి పునరుద్ధరణకే సీఎం నేతృత్వంలో పర్యటన అని మంత్రి నారాయణ తెలిపారు.