భారీ వర్షాలపై మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలపై అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలపై అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీ అంతటా విసృతంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
లోతట్టు ప్రాంతాల వారిని...
దీంతో మంత్రి నారాయణ అధికారులతో మట్లాడారు. వర్షాల వల్ల ఎవరూ ఇబ్బందులు పడకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరార. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ల కమిషనర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారాయణ , లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించార. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.