నేడు విజయనగరానికి నారా లోకేష్
విశాఖకు మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. విజయనగరం వెళుతూ మార్గమధ్యంలో విశాఖలో లోకేష్ ఆగారు
విశాఖకు మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. విజయనగరం వెళుతూ మార్గమధ్యంలో విశాఖలో లోకేష్ ఆగారు. ఎయిర్ పోర్టులో లోకేష్ కు పల్లా శ్రీనివాస్, ఎంపీ శ్రీభరత్, కూటమి నాయకులు.ఘనస్వాగతం పలికారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో విజయనగరానికి లోకేష్ బయలుదేరి వెళ్లనున్నారు. విజయనగరంలో పలు కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు.
భారీ స్వాగతం...
విజయనగరం మంత్రి నారా లోకేష్ వస్తుండటంతో పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. కూటమి నేతలు భారీ సంఖ్యలో హాజరై లోకేష్ ను విజయనగరంలోకి ఆహ్వానించనున్నారు. విజయనగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం స్థానిక నేతలతో సమావేశం అవుతారు. స్థానిక రాజకీయ పరిస్థితులపై లోకేష్ చర్చించనున్నారు.