Nara Lokesh : పవన్ పై లోకేశ్ స్పెషల్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఉమ్మడి చిత్తూరుజిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు తన దృష్టికి తెచ్చారని లోకేశ్ పేర్కొన్నారు.
కుంకీ ఏనుగులను తెప్పించి...
రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారంటూ లోకేశ్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా త కృతజ్ఞతలు అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కుంకీ ఏనుగుల రాకతో ఏనుగుల బెడద తప్పిపోతుందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.