ఎవరినీ వదిలేది లేదు... అధికారులపై కూడా యాక్షన్ ఉంటుంది : నాదెండ్ల
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబీ సీఐడీ విచారణకు ఆదేశించామని పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబీ సీఐడీ విచారణకు ఆదేశించామని పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గంగవరం, కృష్ణపట్నం, విశాఖ పోర్టుల కంటే కాకినాడ పోర్టులోనే భారీగా అక్రమ రవాణా జరిగిందని నాదెండ్ల తెలిపారు. విశాఖ పోర్టుపైనా దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించామని నాదెండ్ల మనోహర్ మీడియాకు తెలిపారు.
గత ప్రభుత్వహయాంలో....
పారదర్శకంగా పీడీఎస్ పంపిణీ జరగాలన్నదే కూటమి ప్రభుత్వం అభిమతమని ఆయన అన్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే గత ప్రభుత్వ హయాంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ కు పెద్దయెత్తున పాల్పడ్డారన్నారు. కొందరు ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఇందులో ఉందని గమనించామని చెప్పారు. ఇప్పటి వరకూ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 1,066 కేసులు నమోదు చేశామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.