నియోజకవర్గ మార్పుపై మంత్రి మేరుగ ఏమన్నారంటే?
తనను నియోజకవర్గాన్ని మార్చడంపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు
Andhra Pradesh
తనను నియోజకవర్గాన్ని మార్చడంపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. తమ పార్టీ అధినేత జగన్ నిర్ణయం ప్రకారమే తాము నడుచుకంటామని చెప్పారు. తాను మూడుసార్లు వేమూరు నియోజకవర్గం నుంచి జగన్ బొమ్మ మీద గెలిచానని, ఇప్పుడు సంతనూతలపాడు ఇన్‌ఛార్జిగా వెళుతున్నానని ఆయన అన్నారు. పార్టీ ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తానని చెప్పారు.
ఎక్కడకు పంపినా...
తనకు ఎక్కడ సీటు ఇచ్చినా అక్కడి నుంచి పోటీ చేస్తానని, అధినాయకత్వం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని మేరుగ నాగార్జున తెలిపారు. తనను సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారని, అక్కడ కూడా వైసీపీ జెండా ఎగిరేలా తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు. తనకు నియోజకవర్గం మార్చడంపై ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన తెలిపారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు