నేడు ఉచిత బస్సు ప్రయాణ విధివిధానలపై సమీక్ష

నేడు ఉచిత బస్సు ప్రయాణం విధివిధానాలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు

Update: 2025-07-29 04:24 GMT

నేడు ఉచిత బస్సు ప్రయాణం విధివిధానాలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచి త బస్సు ప్రయాణం అమలులోకి రానుండటంతో దీనిపై నేడు విధివిధానాలను మంత్రి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు ఆర్టీసీ ఎండీతో పాటు ఇతర అధికారులు సమీక్షించనున్నారు.

ఆర్టీసీ అధికారులతో...
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం చేస్తారని ప్రభుత్వం చెబుతుండగా, అచ్చెన్నాయుడు వంటి నేతలు మాత్రం కొన్ని ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని చెప్పడంతో దీనిపై విధివిధానాలను నిర్ణయించడానికి ఈ సమావేశం జరగనుంది. ఈ సమీక్షలో రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లోని అధికారులు, డిపో మేనేజర్లు పాల్గొననున్నారు.


Tags:    

Similar News