'ఇదంతా నిజమేనా' అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు: మంత్రి కొట్టు

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత.. రాష్ట్ర ప్రజలు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి కొట్టు సత్యనారాయణ

Update: 2023-06-06 12:13 GMT

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత.. రాష్ట్ర ప్రజలు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముదునూర్‌లో మంత్రి సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందన్నారు. ''వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత మేలు జరిగింది.. ఏ ఇంటికి ఎన్ని లక్షల రూపాయలు వచ్చాయి, దాంట్లో పిల్లల చదువు నిమిత్తం ఎంత వచ్చింది. రైతు భరోసా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, డ్వాక్రా రుణమాఫీ, వడ్డీ, ఇలా అన్ని పథకాల కింద ఎంత వచ్చిందనేది డీటెయిల్‌గా చదువుతుంటే.. ఇదంతా నిజమేనా, ఇన్ని డబ్బులు వచ్చాయా?'' అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని మంత్రి కొట్టు చెప్పారు. సీఎం జగన్‌ అమలు చేస్తున్న అన్ని పథకాలు తమకు అందుతున్నాయని ప్రజలు అంటున్నారని, ఆయన చేసిన సాయం పట్ల ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసిందా? అని ప్రజలని అడిగితే చేయలేదని చెబుతున్నారని మంత్రి కొట్టు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి 2019లో ఒక్కరే మారరని, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నారని.. అయితే బడ్జెట్‌ ఆదాయం అప్పుడు అంతే ఉందని, ఇప్పుడు కూడా ఇంచు మించుగా అంతే ఉందని, రాష్ట్రానికి అయిన ఖర్చులు అప్పుడు అంతే ఉన్నాయని, ఇప్పుడు కూడా ఇంచు మించుగా అంతే ఉన్నాయని అన్న మంత్రి కొట్టు.. గడిచిన నాలుగేళ్లలో సీఎం జగన్‌ 2 లక్షల 10 వేల కోట్ల రూపాయలను కోటి 60 లక్షల కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల పేరుతో అందించారని, మరీ చంద్రబాబు హయాంలో ఈ 2 లక్షల 10 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వం డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి చేయలేదన్నారు. రైతు రుణమాఫీ అని చెప్పి వ్యవసాయదారులను నట్టేట ముంచారని మంత్రి కొట్టు ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారని, ఉద్యోగం వచ్చేంత వరకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని.. కానీ ఎక్కడా ఈ పథకాలను అమలు చేయలేదన్నారు. మహిళలు తాకట్టుపెట్టుకున్న బంగారాన్ని విడిపిస్తానని చంద్రబాబు గతంలో చెప్పారని.. దీనికి కౌంటర్‌ గ్యారెంటీ పవన్‌ కల్యాణ్ అని మంత్రి కొట్టు అన్నారు. తన మాటగా చంద్రబాబుకు ఓటేయాలని, తాను రాజ్యాధికారం కోసం పార్టీ పెట్టలేదు, నిలదీయడానికి పార్టీ పెట్టాను ప్రజల తరఫున, ఎవరు తప్పు చేసినా నిలదీస్తాను అని పవన్‌ చెప్పారని మంత్రి కొట్టు గుర్తు చేశారు. అయితే చంద్రబాబు చేసిన తప్పులను ఏరోజైనా ఒక్కసారైనా పవన్‌ కల్యాణ్‌ నిలదీయలేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ నిలదీసినా సందర్భాలను తానెప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబ పిలిస్తే.. మాత్రం బట్టలు కూడా మార్చుకోకుండా హైదరాబాద్‌ నుండి పవన్‌ కళ్యాన్‌ ఫ్లైట్లో వచ్చిన సందర్భాలను తాను చూశానంటూ మంత్రి కొట్టు సెటైర్ వేశారు.  

Tags:    

Similar News