కేసీఆర్ కు మంత్రి అమర్నాథ్ కౌంటర్

తెలంగాణ అంటే.. హైదరాబాద్ ఒక్కటే కాదని, మిగతా ప్రాంతాల్లో భూముల విలువల గురించి కేసీఆర్ మాట్లాడాలన్నారు. ఈ సందర్భంగా ఏపీ..

Update: 2023-06-22 13:25 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రివర్స్ కౌంటరిచ్చారు. పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా.. ఏపీ, తెలంగాణలో భూముల విలువలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఆంధ్రాలోనే ఎకరం అమ్మితే తెలంగాణలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చన్నారు. వైజాగ్ లో ఎకరం భూమి అమ్మితే.. హైదరాబాద్ లో మూడెకరాలు కొనుక్కోవచ్చని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.

తెలంగాణ అంటే.. హైదరాబాద్ ఒక్కటే కాదని, మిగతా ప్రాంతాల్లో భూముల విలువల గురించి కేసీఆర్ మాట్లాడాలన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేతల వైఖరిపైనా అమర్నాథ్ స్పందించారు. ఏపీకి పరిశ్రమలు రావడం లేదని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. రూ.1,400 కోట్ల పెట్టుబడులతో మూడు జిల్లాల్లో నాలుగు పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో జరిగిన ఎంఓయూలో భాగంగా ఈ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని స్పష్టం చేశారు. 2014 నుంచి రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలొచ్చాయో హైదరాబాద్ లో ఉండే పవన్ కి ఏం తెలుస్తుందన్నారు. పవన్ కు ప్రాణహాని అంటూ ఉంటే.. అది చంద్రబాబు వల్లే ఉంటుందన్నారు. టీడీపీలో చంద్రబాబు కంటే ఎదుగుతున్న నేతలను ఆయన కనుమరుగయ్యేలా చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News