Weather Report : నేడు కూడా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల లో నేడు కూడా భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల లో నేడు కూడా భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, సాయంత్రం వేళ భారీ వర్షాలు పడతాయని చెప్పింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు పొలాలకు వెళ్లినప్పుడు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగులు పడే అవకాశముందని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. పంట ఉత్పత్తులు తడిసిపోకుండా అవసరమైన చర్యలు ముందుగా తీసుకోవడం మంచిదని తెలిపింది.
ఇక్కడ పిడుగులు పడతాయ్...
ఈరోజు చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిలపింది. తిరుపతి, కర్నూలు, కడప, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కానీ ఇదే సమయంలో తూర్పు గోదావరి, పార్వతీపురం, విజయనగరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని చెప్పింది. దీంతో పాటు మరో 35 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు వీలయినంత వరకూ బయటకు రాకుండా ఉండటమే మంచిదని సూచించింది. నిన్న రాత్రి నుంచి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడటంతో అనేక కాలనీలు జలమయమయ్యాయి.
తెలంగాణలోనూ భారీ వర్షాలు...
తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో ఈసారి రుతుపవనాలు కూడా జూన్ 12వ తేదీకి వస్తాయని అంచనాలు ఉన్నాయి. అంటే ముందుగానే వర్షాకాలం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా హెచ్చరించింది. ఈదురుగాలులు బలంగా వీస్తాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. కొన్నిప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలునమోదయ్యే అవకాశముందని, నలభై మూడు డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతుంది.