Andhra Pradesh : ఏపీలో నేడు రెయిన్ అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ లో నేడు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు...
ప్రకాశం, నెల్లూరు, కర్నూలు,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కొనసాగుతున్నఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో తీరం వెంట 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పింది. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల్లో ఉండకూడదని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.