Andhra Pradesh : ఏపీకి మరోసారి వెదర్ అలెర్ట్
ఆంధప్రదేశ్ లో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది
Ap weather updates
ఆంధప్రదేశ్ లో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు వర్సాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరుగానూ, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలుకురుస్తాయని పేర్కొంది.
మూడు రోజుల పాటు...
మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణ శఆఖ పేర్కొంది. ఈ సమయంలో గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్లు తెలిపింది. ప్రజలు కొన్ని జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.