Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
Ap weather updates
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో నేడు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో చిన్న పాటి చినుకులు పడతాయని పేర్కొంది.
29 జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
అయితే తెలంగాణలో అత్యధికంగా 29 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. నవరాత్రులు ప్రారంభమయిన తరుణంలో, బతుకమ్మ సంబరాలు జరుగుతున్న సందర్భంలో వర్షాలు ఇబ్బంది పెడతాయోమనన్న ఆందోళనలో భక్తులున్నారు.