Rain Alert : నేడు కూడా ఏపీలో వర్షాలే.. ఈ జిల్లాల్లో
ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
andhra pradesh weather updates
ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయుగుండం పశ్చిమ బంగాళాఖాతంలో ఆగ్నేయదిశగా కొనసాగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు రెండు రోజుల పాటు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మోస్తరు వర్షాలు...
అయితే ఈ వర్షాలు ఉత్తర కోస్తా అయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దక్షిణ కోస్తా అయినా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచనను వాతావరణ శాఖ చేసింది. అయితే అనేక చోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది.