Rain Report : వచ్చే నాలుగు రోజులు అలెర్ట్ గా ఉండాల్సిందే.. భారీగా వానలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. పలు చోట్ల పిడుగులు పడతాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచిమోస్తరు వానలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పలుచోట్ల పిడుగులు...
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని పేర్కొంది. పలు చోట్ల పిడుగులుపడే అవకాశముందని, పొలాల్లోకి వెళ్లే పశువుల కాపర్లు, రైతులు చెట్ల కింద, విద్యుత్తు స్థంభాల కింద నిల్చోవద్దని సూచించింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.
ఉరుములు,మెరుపులతో కూడిన...
తెలంగాణలోవచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉడాలని హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాని తెలిపింది. ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్,సిద్ధిపేట్, జగిత్యాల, ఆసిఫాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.