Weather Update : మరో నాలుగు రోజులు వాతావరణం ఇలానే ఉంటుందట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షంతో పాటు ఎండ వేడిమి కూడా తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-05-03 04:15 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షంతో పాటు ఎండ వేడిమి కూడా తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి వాతావరణ కేంద్రంతో పాటు ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా సేమ్ టు సేమ్ రిపోర్టు ఇచ్చింది. భిన్నమైన వాతావరణంతో ప్రజలు కొంత ఇబ్బంది పడతారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల తేలికపాటి, మరికొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మేఘావృతమయి ఉంటుందని...
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమయి ఉంటుందని కూడా వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని కూడా చెప్పింది. ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షం పడుతుందని, అలాగే మిగిలిన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్పింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా పేర్కొంది.
ఎండల తీవ్రత కూడా...
ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు రాష్ట్రంలో నేడు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అమరావతి రాష్ట్రంలో ఈరోజు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
దంచి కొడుతున్న ఎండలు...
తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తేలికపాటిగా పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా చెప్పింది. అయితే ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు తేలికపాటిగా పడతాయని, అదే దక్షిణ తెలంగాణలో ఎండలు దంచి కొడతాయని కూడా పేర్కొంది. ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలకు చేరే అవకాశముందని తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించింది. ఎండలకు ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా కనీసం రోజుకు ఐదు లీటర్లకు మించకుండా నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News