ఏపీలో ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరోసారి ముప్పు తప్పదని హెచ్చరించింది.

Update: 2021-11-28 08:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరోసారి ముప్పు తప్పదని హెచ్చరించింది. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరింది. బంగాళాఖాతంలో ఈ నెల 30 వతేదీన మరో అల్పపీడనం ఏర్పడనుంది. దక్షిణ అండమాన్ వద్ద ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముంది.

భారీ వర్షాలతో....
ఈ ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పురాతన భవనాలను ఈ నాలుగు జిల్లాల్లో గుర్తించి అక్కడి నుంచి వారిని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇక కాజ్ వే లపై ప్రయాణాలను కూడా నిషేధించనున్నారు. లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.


Tags:    

Similar News