Cyclone Effect : హమ్మయ్య .. గండం తప్పినట్లే...మనకు ముప్పులేనట్లేనట

తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మాత్రం లేదని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-11-27 04:31 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు తీవ్ర వాయుగుండంగా మారనున్నాయి. మధ్య బంగాళాఖాతంలో బలహీనపడుతుంది. వాయుగుండం తుపాను గా మారనుంది. అయితే తుపాను ముప్పు తెలుగు రాష్ట్రాలకు లేదని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంకపైపు తుపాను దూసుకు వెళుతుందని తాజాగా వాతావరణ శాఖ అంచనా వేసింది. తొలుత కోస్తాంధ్రను మరోసారి ఇబ్బందులు పెడుతున్నట్లు ముందుగా అంచనాలు వినపడుతున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మాత్రం లేదని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీవ్రత పెద్దగా ఉండదని ప్రస్తుతానికి అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో కొంత రైతులు ఆందోళనగా ఉన్నారు.

వాయుగుండం ప్రభావంతో...
అయితే వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. ప్రభుత్వం మాత్రం ముందస్తు చర్యలను తీసుకుంటోంది. రైతులు కూడా వరి కోత దశలో ఉంటే వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నవంబరు 29వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీ వరకూ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడిచింది. ఉత్తరాంధ్రలోనూ తేలికపాటి జల్లులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వేటకు వెళ్లిన వారు తిరిగి ఒడ్డుకు రావాలని పేర్కొంది.
తెలంగాణలోనూ అక్కడక్కడ...
తెలంగాణలోనూ వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడ వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక చలితీవ్రత గతంలో కంటే చాలా వరకూ తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం చలితీవ్రత తగ్గినా మళ్లీ పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో పదిహేను డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్నటి వరకూ ఉదయం నుంచి రాత్రి వరకూ ఫ్యాన్ వేయాలంటే వణికిపోయే ప్రజలు ప్రస్తుతం ఫ్యాన్ లు వేసుకునే పరిస్థితికి వచ్చారు. అయితే ఉత్తర తెలంగాణలో మాత్రం చలితీవ్రత కొంత ఎక్కువగానే ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


Tags:    

Similar News