Heavy Rains : వాయుగుండం.. కుండపోత వానలు ఎన్ని రోజులో తెలిస్తే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Update: 2025-10-22 04:25 GMT

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈరోజు మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న ఇరవై నాలుగు గంటల్లో గంటల్లో పుదుచ్చేరి సమీపానికి చేరే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, చెట్ల కింద, హోర్డింగ్ ల కింద నిలబడవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.

అల్పపీడనం ప్రభావంతో...
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కు ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, కడప, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలుపడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కోస్తా,రాయలసీమకు భారీవర్ష సూచన చేసింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 ను ఏర్పాటు చేసింది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
తెలంగాణలో ఐదు రోజులు...
తెలంగాణలోనూ ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు పడతాయని చెప్పింది. ఈరోజు జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News