నాలుగో రోజూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్

తెలుగుదేశం పార్టీ సభ్యులను శాసనసభ సుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు

Update: 2022-09-20 07:17 GMT

తెలుగుదేశం పార్టీ సభ్యులను శాసనసభ సుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. సంక్షేమంపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ పోడియం వద్ద చేరి నినాదాలు చేస్తున్నారు. దీంతో స్పీకర్ అనేక సార్లు టీడీపీ సభ్యులకు ఆందోళన విరమించి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని పదే పదే కోరారు. అయినా టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటుండటంతో స్పీకర్ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.

విద్యాపథకంపై...
నాడు - నేడు విద్యాపథకం పై స్వల్పకాలిక చర్చ జరగాల్సి ఉండగా దానిని అడ్డుకుంటుండటంతో స్పీకర్ టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. దీంతో నాలుగో రోజు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయినట్లయింది. బీఏసీ సమావేశంలో అంగీకరించిన టీడీపీ సభ్యులు సభలో మాత్రం అడ్డుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. సభను అడ్డుకునేందుకే టీడీపీ సభ్యులు వస్తున్నారన్నారు. సమస్యలపై చర్చించాలన్న ఆలోచన కూడా టీడీపీ సభ్యులకు లేదన్నారు. సంక్షేమం అంటే వైసీపీ ప్రభుత్వం అని, ప్రస్తుతం టీడీపీ సంక్షోభంలో ఉందని జోగి రమేష్ అన్నారు.


Tags:    

Similar News