మేకపాటి మరో సవాల్

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి ఉదయగిరిలో సవాల్ విసిరారు. బస్టాండ్ సెంటర్‌లో కుర్చీవేసుకుని కూర్చుని సవాల్ విసిరారు

Update: 2023-03-30 12:39 GMT

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి ఉదయగిరిలో సవాల్ విసిరారు. బస్టాండ్ సెంటర్‌లో కుర్చీవేసుకుని కూర్చుని మరీ సవాల్ విసిరారు. నియోజవర్గానికి వస్తే తనను తరిమి కొడతానన్న వారు ఇక్కడకు రావాలంటూ మేకపాటి ఛాలెంజ్ విసిరారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సవాల్ కు ప్రతి సవాల్...
నిన్న వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి ఉదయగిరి వస్తే తరమి కొడతామని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌కు నిరసనగా ఆయన నేడు ఉదయగిరిలో హల్‌చల్ చేశారు. సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో రోడ్డుపైకి వచ్చి మరీ తనను సవాల్ విసిరిన వారికి తాను ఇక్కడే ఉన్నానని, వచ్చి తరిమి కొట్టాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు అక్కడ ఉన్న వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించాలంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరారు.


Tags:    

Similar News