మెగా డీఎస్సీకి ఆఖరి గడువు ఎల్లుండి
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ -2025 దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15వ తేదీతో ముగియనుంది.
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం మెగా డీఎస్సీ -2025 దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. చివరి రోజు వరకూ ఆగకుండా, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెల 20న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తొలిసంతకం చేయడంతో...
ఇప్పటివరకు 3,03,527 మంది అభ్యర్థులు 4,77,879 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. దీంతో ఈ పోస్టులను భర్తీ చేయాలని, పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం తిరిగి తెరుచుకునేలోపు నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది.