నేడు భవిష్యత్ కార్యాచరణ... కీలక సమావేశం

నేడు ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరగనుంది. ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు.

Update: 2022-02-12 02:26 GMT

నేడు ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరగనుంది. ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ, ఫిట్ మెంట్ పై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వారు విధులు నిర్వహిస్తూనే నిరసనను తెలియచేస్తున్నారు. ఫిట్ మెంట్ 27 శాతం కంటే ఎక్కువ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కొత్త పీఆర్సీతో....
కొత్త పీఆర్సీ వల్ల 13 లక్షల మంది ఉద్యోగులు నష్టపోతున్నారని వారు చెబుతున్నారు. గ్రాట్యుటీ 2020 ఏప్రిల్ నుంచి అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను గతేడాది అక్టోబరు 22 నుంచి రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు తమతో కలసి వచ్చే సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణను నేడు నిర్ణయించబోతున్నారు.


Tags:    

Similar News