Janasena : నేడు అనకాపల్లిలో కొణతాల ఆత్మీయ సమావేశం

ఈరోజు అనకాపల్లిలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొణతాల రామకృష్ణ పాల్గొననున్నారు

Update: 2024-01-29 03:56 GMT

ఈరోజు అనకాపల్లిలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొణతాల రామకృష్ణ పాల్గొననున్నారు. అనకాపల్లిలో జరగనున్న ఆత్మీయ సమావేశానికి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి జనసైనికులతో పాటు ముఖ్య నేతలు రావాలని ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. కొణతాల రామకృష్ణ జనసేనలో చేరిన తర్వాత తొలి సమావేశం కావడంతో ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి చేరుకోనున్నారు.

4న పవన్ సభకు...
మరోవైపు వచ్చే నెల 4వ తేదీన అనకాపల్లిలో జనసేన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఈ ఆత్మీయ సమావేశాన్ని సన్నాహక సమావేశంగానూ నిర్వహించనున్నారు. పవన్ పాల్గొనే సభను విజయవంతం చేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. పెద్ద సంఖ్యలో జనసైనికులు హాజరై చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని నేతలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు శ్రమిస్తున్నాను.


Tags:    

Similar News