నేడు దక్షిణాది డీజీపీల సమావేశం
నేడు తిరుపతిలో దక్షిణాది రాష్టాల డీజీపీల సమావేశం జరగనుంది
నేడు తిరుపతిలో దక్షిణాది రాష్టాల డీజీపీల సమావేశం జరగనుంది. దేశంలో తీవ్ర వాదం, నక్సలిజం, అంతర్రాష్ట్ర వివాదాలు, ఎర్రచందనం సహా ఇతర అంతర్రాష్ట్ర నేరాలపై సమీక్ష జరగనుంది. అయితే ఈ సమావేశానికి కేవలం అధికారులు మాత్రమే హాజరు కానున్నారు. వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించి వాటికి పరిష్కార మార్గం ఆలోచించనున్నారు.
తీవ్రవాదం, నక్సలిజంపై...
ప్రధానంగా దేశంలో తీవ్రవాదంతో పాటు నక్సలిజాన్ని అణిచి వేయడంలో కొంత సక్సెస్ అయినట్లు కనిపించినా ఇంకా మూలాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు అంతరాష్ట్ర వివాదాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల డీజీపీలు, ఇతర అధికారులు హాజరుకానున్నారు.