నేడు ఏపీ ఏజెన్సీ ప్రాంతంలో బంద్

ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతంలో నేడు మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చారు.

Update: 2025-06-20 02:46 GMT

ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతంలో నేడు మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చారు. మావోయిస్టులపై జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ బంద్ కు పిలుపు నిచ్చారు. బంద్ కారణంగా రంపచోడవరం, మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ఏజెన్సీల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలో గ్రేహాండ్స్ బలగాలను మొహరించాయి.

ఎన్ కౌంటర్ కు నిరసనగా...
బస్సులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలను నిర్వహించి పంపుతున్నారు. అనుమానాస్పద కదిలికలుంటే వారిని ప్రశ్నిస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో గ్రేహౌండ్స్ బలగాలు ఏజెన్సీలో పహరా కాస్తున్నాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంది. విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తుండటంతో భద్రతా బలగాలు పెద్దయెత్తున మొహరించాయి.


Tags:    

Similar News