Encounter : మారేడుమిల్లిలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టు అగ్రనేతల మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.

Update: 2025-06-18 04:10 GMT

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మారేడుమిల్లి మండలం సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కీలకమైన ముగ్గురు మావోయిస్టు నేతలు మరణించారు. మావోయిస్టుల అగ్రనేత చలపతి భార్య అరుణతో పాటు కేంద్రకమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అంజు ఉన్నట్లు తెలిసింది.

కొనసాగుతున్న కూంబింగ్...
ముగ్గురు మావోయిస్టులపై ఇరవై ఐదు లక్షల రూపాయల రివార్డు కూడా ఉందని తెలిసింది. మావోయిస్టుల నుంచి పెద్దయెత్తున ఆయుధాలను ఈ సందర్భంగా భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. మారేడుమిల్లి అడవుల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి పెద్దయెత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకుంటున్నాయి.


Tags:    

Similar News