Tirumala : నేడు తిరుమలలో మహా శాంతి యాగం
నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం జరుగుతుంది. యాగాన్ని అర్చకులు ఉదయాన్నే ప్రారంభించారు.
mahashanthi yagam at tirumala
నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం జరుగుతుంది. యాగాన్ని అర్చకులు ఉదయాన్నే ప్రారంభించారు. ఉదయం పది గంటల వరకూ ఈ క్రతువు కొనసాగనుంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న కారణాలతో మహా శాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఆలయ సంప్రోక్షణతో పాటు...
యాగశాలలో ఈ క్రతువును అర్చకులు ప్రారంభించారు. పంచగవ్య పదార్థాల సంప్రోక్షణతో మహాశాంతి యాగం ముగియనుంది. తిరుమలలో అపచారం జరిగి కోట్లాది హిందూ మనోభావాలు దెబ్బతిన్నందున ఆలయ సంప్రోక్షణ కార్యక్రమంతో పాటు మహా శాంతి యాగాన్ని కూడా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈరోజు ఉదయం ఈ మహాశాంతి యాగం ప్రారంభమయింది.