Pinnelli : మాచర్ల మాజీ పిన్నెల్లి ట్వీట్ ఇంత వైరల్ అయిందేంటి?
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. బటన్ నొక్కడంపై ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది."ముసలమ్మ ముసలమ్మ ఎక్కడ ఉన్నావే... ఇక్కడ ముసలాయన బటన్ నొక్కలేపోతున్నాడు కాస్త వచ్చి బట్టన్ నొక్కరాదే" అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కడం పెద్ద కష్టమా? మంచం మీద ముసలమ్మ అయినా బటన్ నొక్కుతుందన్న వ్యాఖ్యలకు కౌంటర్ గా పిన్నెల్లి ఈ ట్వీట్ చేశారు. జగన్ సీఎంగా ఉండగా 2024 ఏప్రిల్, మే నెలల్లో కూడా 12.72 కోట్ల పనిదినాలు కల్పించారని, ప్రస్తుతం ఉపాధి కూలీలకు సగటున రోజుకు రూ.255 చొప్పున వేతనాలు లభిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం గత ఏడాది మాదిరిగా పనులు కల్పించినా గ్రామీణ పేదలకు రూ.700 కోట్ల వరకు లబ్ధి కలిగేదని పిన్నెల్లి అన్నారు.