Ap Politics : నా మీద కులముద్ర వేసినా సరే.. నా మద్దతు ఆ పార్టీకే

ఆంధ్రప్రదేశ్ లో తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని లోక్‌సత్తా అధినేత జయప్రకా‌శ్ నారాయణ తెలిపారు

Update: 2024-03-20 12:07 GMT

ఆంధ్రప్రదేశ్ లో తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని లోక్‌సత్తా అధినేత జయప్రకా‌శ్ నారాయణ తెలిపారు. రేపటి నుంచి తనపై కులముద్ర వేస్తారని తెలుసునని, అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ కూటమితోనే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కూటమి అధికారంలోకి వస్తే...
ఈ కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పరిశ్రమల స్థాపన జరుగుతుందని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆ నమ్మకం తనకు ఉన్నందునే ఆ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రజలు, మేధావులు, రైతులు ఆలోచించి పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కూటమికి మద్దతివ్వాలని కోరారు. ఈ ప్రకటన చేసినందుకు తనపై కులముద్రతో పాటు, తనను దూషించేవాళ్లు కూడా అనేక మంది బయలుదేరుతారని, అయితే నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.


Tags:    

Similar News