Andhra Pradesh : ఏపీలో ఎన్నికలు కీలక అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ప్రారంభమయింది.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ప్రారంభమయింది. ఏపీలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపాలిటీలులకు సంబంధించి ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రారంభించినట్లయింది. ఈ ఎన్నికలను నాలుగో దశలలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం స్నాహిని చెప్పిన విషయం తెలిసిందే.
జనవరిలో నోటిఫికేషన్...
అయితే డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశమై, జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్థానిక ఎన్నికల కంటే ముందుగా పద్దెనిమిదేళ్లు ఏళ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగు సార్లు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించేలా చట్ట సవరణ కోసం ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని తెలిపారు.