తిరుమల: మరో చిరుత చిక్కిందోచ్‌..

గత కొన్ని రోజులుగా తిరుమల నడక మార్గంలో భయాందోళనకు గురి చేస్తున్న చిరుతలు ఒక్కొక్కటికిగా బోన్‌లకు చిక్కేస్తున్నాయి...

Update: 2023-09-07 03:02 GMT

గత కొన్ని రోజులుగా తిరుమల నడక మార్గంలో భయాందోళనకు గురి చేస్తున్న చిరుతలు ఒక్కొక్కటికిగా బోన్‌లకు చిక్కేస్తున్నాయి. చిరుత దాడిలో మృతి చెందిన బాలిక తర్వాత టీటీడీతో పాటు అటవీ శాఖ అధికారులు, పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి చిరుతలను బంధించే పనిలో ఉన్నారు అటవీ శాఖ అధికారులు. ఇక తాజాగా తిరుమల నడకదారిలో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలినడక మార్గంలో ఏర్పాటు చేసిన బోనులు చిరుతపులి చిక్కింది. ఇప్పటి వరకు వరుసగా ఐదు చిరుతలను పట్టుకున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన ప్రాంతమైన నరసింహ స్వామి ఆలయం, 7వ మైలు మధ్యలో చిరుత బోనులో చిక్కింది.

నాలుగు రోజుల క్రితమే ట్రాప్ కెమరాలో కనిపించింది చిరుత. దాంతో అలర్ట్ అయిన టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది.. ఆ చిరుతను పట్టుకునేందు బోనును ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి సమయంలో చిరుత బోనులో చిక్కింది. కాగా, అలిపిరి నడక మార్గంలో ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా, ఇప్పుడు చిక్కిన 5వ చిరుత కూడా మగ చిరుతగానే భావిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News