8 కాళ్లతో జన్మించిన గేదె దూడ.. బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని కామెంట్స్

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో వింత ఘటన చోటుచేసుకుంది. గోకవరం మండలం మురళినగర్‌కు చెందిన..

Update: 2022-12-24 09:46 GMT

lamb born with 8 legs

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడ ఏ వింత ఘటన జరిగినా వెంటనే తెలిసిపోతుంది. వాటిలో వింత శిశువులు జన్మించడం, వింత జంతువులు పుట్టడం వంటి ఘటనలు ఇట్టే వైరలవుతాయి. ఇటీవల ఓ శిశువు నాలుగు కాళ్లతో జన్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ గేదె దూడ నాలుగు కాళ్లతో జన్మించింది. ఆ ఫోటో నెట్టింట్లో వైరలవడంతో.. నెటిజన్లు పోతులూరి వీర బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లే జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో వింత ఘటన చోటుచేసుకుంది. గోకవరం మండలం మురళినగర్కు చెందిన ఓ రైతు ఇంట్లో వింత దూడ జన్మించింది. దేవిశెట్టి రత్నాజీ అనే రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. రెండు వెన్నుముకలు, 8 కాళ్లు, ఒకే తలతో జన్మించిన ఈ దూడను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాగా దూడను పరీక్షించిన పశు వైద్యులు జన్యుపరమైన లోపం కారణంగా దూడ అలా జన్మించిందన్నారు.





Tags:    

Similar News