Kodali Nani on PawanKalyan:ఆయన్ను జనసైనికులే రక్షించుకోవాలి: కొడాలి నాని

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. జనసైనికులకు కీలక సూచన చేశారు

Update: 2024-03-04 10:29 GMT

Kodali Nani on PawanKalyan:వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. జనసైనికులకు కీలక సూచన చేశారు. పవన్ కళ్యాణ్ ను కాపాడుకోవాల్సింది జనసైనికులేనని అన్నారు కొడాలి నాని. పవన్ కళ్యాణ్ ను ఓడించేది తెలుగుదేశం పార్టీయేనని.. ఈ విషయం ఎన్నికల తర్వాత అందరికీ అర్థమవుతుందని అన్నారు. అభిమానులు అప్రమత్తం కావాలని, లేకపోతే పవన్ కళ్యాణ్ తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. చంద్రబాబుకు ఓట్లు కావాలే తప్ప సీట్లు ఇవ్వరని.. మూడు శాతం ఓట్లు ఉన్న తన సామాజిక వర్గానికి చంద్రబాబు 30 సీట్లు ఇచ్చుకున్నాడని, 20 శాతం ఉన్న వర్గానికి మాత్రం 24 సీట్లే ఇచ్చారని విమర్శలు గుప్పించారు కొడాలి నాని. జనసేనకు ఇచ్చిన ఆ 24 సీట్లలో 10 సీట్లు కచ్చితంగా ఓడిపోయే సీట్లేనని.. అలాంటి సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. తీసుకోడానికి పవన్ కళ్యాణ్ కైనా సిగ్గుండాలని విమర్శించారు. చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు అని, అలాంటివాళ్లను పవన్ పక్కనబెట్టుకుని తిరుగుతున్నాన్నారు.

ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని నోటికొచ్చినట్లు వాగుతున్నారని కొడాలి నాని విమర్శించారు. పీకేలాంటి వాళ్లు ఎన్ని జాతకాలు, జ్యోతిష్యాలు చెప్పినా కూడా ఏపీలో వైసీపీ విజయాన్ని ఆపలేరని అన్నారు. పీకేని ఐప్యాక్ టీమ్ తన్ని తరిమేస్తే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని జాతకాలు చెప్తున్నారన్నారు. పీకేలాంటి వ్యక్తుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని దుమ్మెత్తిపోశారు.


Tags:    

Similar News