Vallabhaneni Vamsi : వంశీ అరెస్ట్ కేసులో మరో ట్విస్ట్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన సత్యవర్ధన్ ను పటమట పోలీసులు న్యాయస్థానానికి తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ ఎదుట సత్యవర్థన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల పదో తేదీన సత్యవర్ధన్ కేసును విత్ డ్రా చేసుకున్నారు.
బెదిరింపులకు దిగారంటూ...
సత్యవర్ధన్ పై వల్లభనేని వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరులు బెదిరింపులకు దిగడంతో పాటు కిడ్నాప్ కు గురి చేయడం, పది లక్షల రూపాయలు నగదు ఇవ్వడం వంటి వాటిపై ఆధారాలను సేకరించారు. హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ నివాసానికి సత్యవర్ధన్ రావడాన్ని కూడా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. మరొక వైపు వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ తో పాటు తనకు ఇంటి నుంచి ఆహారం, ప్రత్యేక బెడ్ ను కేటాయించాలని దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.