Breaking : వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ చేయడానికి ఈ నెల 23వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో భారీగా మనీలాండరింగ్, హవాలా జరిగిందన్న అనుమానాలను ఈడీ వ్యక్తం చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఇప్పటికే సిట్ అధికారులు ఆయనను విచారించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారని తెలిసింది.