భూమనకు టీడీపీ ఎమ్మెల్యేల ఫోన్

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2025-04-17 07:57 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూమన కరుణాకర్ రెడ్డికి చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే పులివర్తి నాని ఫోన్ చేశారు. టీటీడీ గోశాలకు రావాలని భూమనను పులివర్తి నాని కోరారు. అవసరమైన భద్రత కల్పిస్తామని టిడిపి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డికి తెలిపారు.

ఎస్పీతో మాట్లాడి...
ఎస్పీతో మాట్లాడి ఎస్కార్ట్ పంపుతామని టీడీపీ నేతుల చెప్పారు. భద్రత కల్పిస్తే గోశాలకు వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, వారికి చెప్పాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు భూమన కరుణాకర్ రెడ్డి సూచించారు. తాను గోశాలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.


Tags:    

Similar News