Breaking : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎ 30 నిందితుడిగా ఉన్న పైలా దిలీప్ కు బెయిల్ మంజూరు చేసింది
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎ 30 నిందితుడిగా ఉన్న పైలా దిలీప్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి వద్ద పీఏగా దిలీప్ పనిచేశాడు. గత 117 రోజుల నుంచి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
ఎ 30 నిందితుడిగా ఉన్న...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం పన్నెండు మందిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేయగా తొలి సారిగా ఒకరికి బెయిల్ లభించింది. ఇదే కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై రేపు ఏసీబీ కోర్టు తీర్పు చెప్పనుంది. మరొకవైపు ఇదే కేసులో రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటీషన్లను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.