విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

Update: 2026-01-17 06:17 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన ఢిల్లీ లేదా హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి పేరు కూడా వినిపంచడంతో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో...
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభ కోణం కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. చాలా మందిని విచారించారు. డిస్టిలరీల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. విజయసాయిరెడ్డిని ఈ కేసులో విచారించేందుకు అవసరమైన విషయాలు తెలుసుకునేందుకు ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.


Tags:    

Similar News