కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయాలివే

కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు

Update: 2025-07-16 12:06 GMT

కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించేందుకు అధికారులతో కూడిన కమిటీని నియమించాలని నిర్ణయించారు. ఈ కమిటీని ఈ నెల 21 వతేదీ లోగా ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.గోదావరి, కృష్ణానదీ జలాల వివాదంపై కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

నిర్వహణ బోర్డులను...
శ్రీశైలం ప్లంజ్ పూల్ ను మూసివేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు గోదావరి నిర్వహణ బోర్డును హైదరాబాద్ లోనూ, కృష్ణానదీవాటర్ నిర్వహణ బోర్డును అమరావతి నుంచి పనిచేసేలా చూడాలని సమావేశంలో వచ్చిన ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారు. రిజర్వాయర్ల నీటి అవుట్ ఫ్లో వ్యవస్థను లెక్కించడానికి టెలీ మీటర్లను ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలు నీటి వాటా నష్టపోకుండా ఉండేలా చర్యలు తీసుకునేలా రూట్ మ్యాప్ తయారు చేసే పనిని కమిటీకి అప్పగించనున్నారు.


Tags:    

Similar News