చీరాల నుంచే పోటీ చేస్తా

తాను వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని కరణం వెంకటేష్ తెలిపారు.

Update: 2022-09-18 06:09 GMT

తాను వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని కరణం వెంకటేష్ తెలిపారు. వైసీపీ నుంచి తాను పోటీ చేస్తానని ఆయన తెలిపారు. బాపట్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల స్పందనను బట్టి తాను చీరాల నుంచి మాత్రమే పోటీ చేయాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. అయితే తనకు ఎక్కడ టిక్కెట్ ఇస్తారన్నది వైసీపీ అధినాయకత్వం నిర్ణయమని వెంకటేష్ తెలిపారు.

జగన్ పట్ల సానుకూలత...
జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని తెలిపారు. ఈ మూడేళ్లలో చీరాలలో 1.65 కోట్ల రూపాయలు వివిధ పథకాల కింద లబ్దిదారులకు అందజేశామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారనడానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే కారణమని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసమే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారని కరణం వెంకటేష్ తెలిపారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News