Mudragada : నేడు ముద్రగడ వైసీపీలో చేరిక

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు వైసీపీలో చేరనున్నారు.

Update: 2024-03-15 03:16 GMT

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు వైసీపీలో చేరనున్నారు. ఆయన నిన్న రాత్రి కిర్లంపూడి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటి వరకూ ఆయన కాపు సామాజికవర్గం సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలకూ దూరంగా ఉన్నారు. అయితే ఈరోజు ఆయన వైసీపీలో చేరుతుండటంతో సుదీర్ఘకాలం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లయింది.

సుదీర్ఘకాలం తర్వాత...
ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కాపు సామాజికవర్గంలో ప్రభావం చూపే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా పార్టీలో నేడు చేరనున్నారు. ఎలాంటి షరతులు లేకుండా పద్మనాభం వైసీపీలో చేరాలని నిర్ణయించారు. తొలుత కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ర్యాలీగా వెళ్లాలని భావించినా పోలీసులు అనుమతివ్వకపోవడంతో కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే ఆయన పార్టీలో చేరుతున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పారు.


Tags:    

Similar News