ముద్రగడ పద్మనాభానికి అస్వస్థత

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు

Update: 2025-07-20 02:50 GMT

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ యశోదకు కుటుంబ సభ్యులు తరలించాలని నిర్ణయించారు.కాపు ఉద్యమ మాజీ నేత వైసిపి సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి కి అస్వస్థత కలగడంతో ఆయనను హైదరాబాద్ కు తరలించాలని నిర్ణయించారు. గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. కాకినాడ ఆసుపత్రిలో చికిత్ప పొందుతున్నారు.

హైదరాబాద్ తరలించేందుకు...
ముద్రగడ పద్మనాభాన్ని తొలుత రాజమండ్రి లేదా కాకినాడ హాస్పిటల్ కి తరలించేందుకు కుటుంబసభ్యులు సిద్దమయ్యారు. అయితే తనను హైదరాబాద్ యశోద హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలని ముద్రగడ పద్మనాభం సూచించారు. దీంతో ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ముద్రగడ పద్మనాభం షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులతో ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్స్ లో హైదరాబాద్ కు కుటుంబసభ్యులు తరలిస్తున్నారు


Tags:    

Similar News