నేడు కడప మేయర్ ఎన్నిక

నేడు కడప మేయర్ ఎన్నిక జరగనుంది

Update: 2025-12-11 04:30 GMT

నేడు కడప మేయర్ ఎన్నిక జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు కడప మేయర్ ఎన్నిక జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు జాయింట్ కలెక్టర్ సమక్షంలో కడప మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. కడప మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాక సురేశ్ పేరును ఖరారు చేసింది. పాక సురేశ్ కు మెజారిటీ సభ్యుల మద్దతు ఉంది.

పాక సురేశ్ బాబుకే...
కడప మాజీ మేయర్ సురేష్ బాబును ప్రభుత్వం తొలగించడంతో ఆయన హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే హైకోర్టులోనూ కడప మేయర్ ఎన్నిక కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు ఎన్నిక జరగనుంది. కడప కార్పొరేషన్ లో వైసీపీకి మెజారిటీ ఉంది. దీంతో వైసీపీ తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. టీడీపీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. కడప మేయర్ ఎన్నిక సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు


Tags:    

Similar News