నేటితో ముగియనున్న రిమాండ్

టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది.

Update: 2023-09-22 03:11 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ విధానంలో చంద్రబాబును కోర్టులో హాజరు పర్చనున్నారు. ఇప్పటికే అనేక కేసుల్లో పీటీ వారెంట్లు చంద్రబాబు విషయంలో కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఫైబర్ నెట్ కేసులో కూడా పీటీ వారెంట్ ను సీఐడీ తరుపున న్యాయవాదులు దాఖలు చేశారు. గత నెల పదోతేదీన చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా వెళ్లిన సంగతి తెలిసిందే.

వైద్య పరీక్షలు...
ఈరోజు జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. నేటితో జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో రిమాండ్ పొడిగిస్తారా? బెయిల్ ఇస్తారా? అన్న టెన్షన్ కొనసాగుతుంది. మరోవైపు నేడు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీ కస్టడీ పై తీర్పు వెలువడనుంది. ఈ సందర్భంగా ఎనిమిది మంది వైద్య బృందం చంద్రబాబుకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించనుంది. ఈ బృందం వైద్య పరీక్షలను నిర్వహించి నివేదికను ఇవ్వనుంది. చంద్రబాబు త్వరగా బెయిల్‌పై బయటకు రావాలంటూ టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు.


Tags:    

Similar News