నేడు వైసీపీలోకి మాజీ పీసీసీ చీఫ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మాజీ ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ వైసీపీలో చేరనున్నారు

Update: 2025-02-07 02:18 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మాజీ ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ వైసీపీలో చేరనున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో శైలజానాధ్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. సాకే శైలజానాధ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు. శైలజా నాధ్ శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2004, 2009 లో విజయం సాధించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి...
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. వైఎస్ మరణం తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ ను వీడలేదు. విద్యాశాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన సాకే శైలజానాధ్ 2022 నుంచి కొన్ని నెలల పాటు ఏపీసీసీ చీఫ్ గా పనిచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని భావించిన సాకే శైలజానాధ్ నేడు వైసీపీలో చేరనున్నారు. ఆయన చేరికతో శింగనమల నియోజకవర్గంలో బలమైన నేత వైసీపీకి దొరికినట్లయింది.


Tags:    

Similar News