Andhra Pradesh : నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం

నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జోగి రమేష్ పేరును నిందితుడిగా చేర్చారు.

Update: 2025-10-31 03:27 GMT

నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జోగి రమేష్‌ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారుచేసినట్లు కస్టడీ విచారణలో జనార్ధనరావు స్టేట్‌మెంట్‌ ఇవ్వడంతో జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జనార్ధన్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన ఎక్సైజ్‌ పోలీసులు ఎక్సైజ్‌ పోలీసులు జోగి రమేష్‌ను నిందితుడిగా చేర్చారు.

జోగి రమేష్ ను నిందితుడిగా...
జోగి రమేష్‌ను ఎక్సైజ్‌ పోలీసులు విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ములకలపల్లిలో నకిలీ మద్యం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం కు విచారణ నిమిత్తం అప్పగించారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేశారు. జోగిరమేష్ ను కూడా విచారించే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News